ఉత్తర కొరియాలో తీవ్ర ఆహారకొరత... పెంపుడు కుక్కలను ప్రభుత్వానికి అప్పగించాలంటూ కిమ్ ఆదేశాలు
- కుక్కను కలిగివుండడం బూర్జువా ధోరణికి నిదర్శనమన్న కిమ్
- పట్టుకున్న కుక్కలను రెస్టారెంట్లకు అప్పగింత
- కిమ్ పై వ్యతిరేకుల ఆగ్రహం
కిమ్ ఆదేశాలు ఇచ్చిందే తరువాయి, అధికారులు పెంపుడు కుక్కలు ఉన్న ఇళ్లను గుర్తించి, వాటిని పట్టుకునే చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ శునకాలను ప్రభుత్వం నిర్వహించే జూలకు గానీ, కుక్కమాంసం వంటకాలు విక్రయించే రెస్టారెంట్లకు గానీ తరలించనున్నారు. కొరియాలో కుక్కమాంసం తినడం ఎప్పట్నించో ఉంది. అయితే, కుక్కమాంసం తినే అలవాటు దక్షిణ కొరియాలో క్రమంగా తగ్గిపోతుండగా, కిమ్ మాత్రం ఆహార కొరత నేపథ్యంలో పెంపుడు కుక్కలపై పడ్డారని అతడి వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు.