వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు
- ఒక్కటైన వాగులు, వంకలు
- చెరువులను తలపిస్తున్న పంట పొలాలు
- రహదారులు దెబ్బతినడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్
చెరువులు నిండి అలుగుపోస్తున్నాయి. చెరువులకు గండ్ల భయంతో చాలా ప్రాంతాల్లో స్థానికులు మత్తళ్లను తవ్వేశారు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. భారీ వర్షాల కారణంగా చాలా గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.