టీమిండియా క్రికెటర్లపై చవకబారు వ్యాఖ్యలు చేసిన షోయబ్ అక్తర్
- తన బౌలింగ్ అంటే భయపడేవాళ్లని వెల్లడి
- భార్యాపిల్లలున్నారని చెప్పేవాళ్లని వ్యాఖ్యలు
- ఓ క్రికెట్ వ్యాఖ్యాతకు ఇంటర్వ్యూ ఇచ్చిన అక్తర్
"కావాలంటే అవుట్ చేసుకో... కానీ మా శరీరాలకు తగిలేలా బంతులు విసరొద్దు. మేం భార్యాపిల్లలు కలవాళ్లం. మా తల్లిదండ్రులు మాకు తగిలిన గాయాలు చూసి తట్టుకోలేరు అని టీమిండియా క్రికెటర్లు చెప్పేవాళ్లు. ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి" అని అక్తర్ వివరించాడు. క్రికెట్ వ్యాఖ్యాత సవేరా పాషాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. కౌంటీల్లో ఓసారి ఓ ఇంగ్లీష్ బ్యాట్స్ మన్ తనతో అడిగి మరీ బౌలింగ్ చేయించుకుని దవడ పగలగొట్టుకున్నాడని అక్తర్ చెప్పుకొచ్చాడు. తాను విసిరిన బంతి తగిలి వికెట్లమీద పడిపోయాడని, చచ్చిపోయాడనే భావించానని పేర్కొన్నాడు.