Ram: జగన్ గారూ.. మీకు తెలియకుండా పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది: హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు

Hero Ram Pothineni sensational comments related to YS Jagan
  • ట్వీట్ తో కలకలం రేపిన రామ్ పోతినేని
  • జగన్ ను తప్పుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడి
  • వాళ్లపై ఓ లుక్కేయండి అంటూ సూచన
టాలీవుడ్ యువ హీరో రామ్ పోతినేని ఉరుముల్లేని పిడుగులా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ గారూ పెద్ద కుట్ర జరుగుతోన్నట్టుంది అంటూ ట్వీట్ చేసి తీవ్ర కలకలం రేపారు. "సీఎంను తప్పుగా చూపించడానికి పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది. వైఎస్ జగన్ గారూ, మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ ప్రతిష్ఠకు, మేం మీమీద పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది. అలాంటి వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం" అంటూ రామ్ ట్విట్టర్ లో స్పందించారు. అంతేకాదు, "ఏపీ గమనిస్తోంది" అంటూ హ్యాష్ టాగ్ కూడా పెట్టారు.

Ram
Jagan
Conspiracy
Aware
YSRCP
Andhra Pradesh
Tollywood

More Telugu News