foot ball: మైఖేల్‌ జోర్డాన్‌ ధరించిన బూట్లను రూ.4.60 కోట్లకు కొనుక్కున్న అభిమాని!

Michael Jordan Rare trainers fetch  4 crores at auction
  • అమెరికా బాస్కెట్‌ బాల్‌ స్టార్‌ మైఖేల్‌ జోర్డాన్‌
  • బూట్లను ఇటీవల వేలానికి పెట్టిన జోర్డాన్
  • గతంలో ఈ బూట్లతోనే మ్యాచ్‌లు ఆడిన మైఖేల్  
అమెరికా బాస్కెట్‌ బాల్‌ స్టార్‌ మైఖేల్‌ జోర్డాన్‌ తన బూట్లను ఇటీవల వేలానికి పెట్టాడు. ఆన్‌లైన్‌ వేలంలో ఈ బూట్లు రికార్డు స్థాయిలో సుమారు రూ.4.60 కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ బూట్లను ధరించే జోర్డాన్‌ 1985లో ఇటలీలో జరిగిన ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో షికాగో బుల్స్‌ తరఫున ఆడాడు.

ఎరుపు, నలుపు రంగులో ఈ బూట్లు ఉన్నాయి. వీటి సైజు 13.5.‌ మైఖేల్‌ జోర్డాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇంతకు ముందు కూడా ఆయన తన బూట్లను వేలానికి పెట్టగా అవి కూడా రికార్డు స్థాయిలో రూ.4.19 కోట్లకు అమ్ముడుపోవడం గమనార్హం.
foot ball
sports

More Telugu News