వైష్ణవ్ తేజ్ కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్!
- వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం ప్రారంభం
- దర్శకత్వం వహిస్తున్న క్రిష్
- రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్
మరోపక్క, పవన్ కల్యాణ్ తో తాను చేస్తున్న భారీ చిత్రానికి బ్రేక్ రావడంతో, ఈ గ్యాప్ లో వైష్ణవ్ తేజ్ తో ఓ చిన్న సినిమా చేయాలని క్రిష్ ప్లాన్ చేశాడు. ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమైంది. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ నిర్వహించి, సింగిల్ షెడ్యూల్ లో దీనిని పూర్తిచేయాలని క్రిష్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా నిర్మాణ కార్యక్రమాలను ప్లాన్ చేసుకున్నారు.