ఇరాన్ చమురు నౌకలను తొలిసారిగా సీజ్ చేసిన అమెరికా!
- ఇరాన్ పై ఇప్పటికే కఠిన ఆంక్షలు విధించిన అమెరికా
- వెనిజులాకు వెళుతున్న నాలుగు షిప్ ల సీజ్
- వాటిని హ్యూస్టన్ తీరానికి తరలించిన సైన్యం
ఇప్పటికే అమెరికా సర్కారు, ఇరాన్ పై అణు పరీక్షలు, సీమాంతర క్షిపణుల పరీక్షలను నిర్వహించకుండా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమాలు శాంతి కోసమేనని వెల్లడించింది. కాగా, లూనా, పండి, బీరింగ్, బెల్లా అనే పేర్లున్న నౌకలను సైన్యం సహాయంతో సముద్రంలో సీజ్ చేసిన అమెరికా, వాటిని హ్యూస్టన్ తీరానికి తరలించింది. అమెరికా ఉన్నతాధికారులు త్వరలోనే వీటిని సందర్శిస్తారని తెలుస్తోంది.