Niharika: మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం... ఫొటోలు ఇవిగో!

Konidela Niharika engagement with Chaitanya
  • జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక ఎంగేజ్ మెంట్
  • హైదరాబాదులో వేడుక
  • హాజరైన చిరంజీవి, రామ్ చరణ్, బన్నీ తదితరులు
టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. తాజాగా మెగాస్టార్ ఇంట్లోనూ శుభకార్యం జరిగింది. నాగబాబు కుమార్తె నిహారిక, జొన్నలగడ్డ చైతన్యల నిశ్చితార్థం హైదరాబాదులో జరిగింది. చైతన్య గుంటూరు రేంజి ఐజీ ప్రభాకర్ రావు తనయుడు. ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. నిహారిక, చైతన్యల పెళ్లి గురించి ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది.

 తాజాగా, కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడంతో ఇక పెళ్లి చేసుకోవడమే మిగిలింది. కాగా, నిశ్చితార్థ వేడుకలో నాగబాబు కుటుంబ సభ్యులతో పాటు చిరంజీవి దంపతులు, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్, సాయితేజ్ తదితరులు సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Niharika
Chaitanya
Engagement
Nagababu
Chiranjeevi
Allu Arjun
Ramcharan

More Telugu News