Atchannaidu: అచ్చెన్నాయుడికి కరోనా సోకడం పట్ల చంద్రబాబు విచారం

Chandrababu says saddened to learn Atchannaidu tested corona positive
  • మాజీమంత్రి అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్
  • గుంటూరు రమేశ్ ఆసుపత్రిలో చికిత్స
  • నిజంగా ఎంతో బాధ కలిగిందన్న చంద్రబాబు
మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ పరిణామం టీడీపీ వర్గాలను విచారానికి గురిచేసింది. ఓవైపు అనారోగ్యంతో బాధపడుతున్న అచ్చెన్నకు కరోనా సోకడం వారిని బాధిస్తోంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. అత్యంత సన్నిహితుడు, పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు కరోనా బారినపడడం నిజంగా వేదనకు గురిచేసిందని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని, పూర్తి ఆరోగ్యవంతుడవ్వాలని ప్రార్థిస్తున్నానని వెల్లడించారు.

ఈఎస్ఐ కొనుగోళ్ల అవకతవకల కేసులో ఏసీబీ అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పైల్స్ కు శస్త్రచికిత్స చేయించుకుని, తదనంతరం చికిత్స అందుకుంటున్నారు. ఇంతలోనే ఆయనకు కరోనా అని వెల్లడైంది. ప్రస్తుతం అచ్చెన్న గుంటూరు రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Atchannaidu
Chandrababu
Corona Virus
Positive
ACB
ESI Scam

More Telugu News