Vijay Sai Reddy: చంద్రబాబు పేరు వింటేనే ఏజెన్సీ ప్రాంతం ఉలిక్కిపడుతుంది: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy criticised Chandrababu on tribal issues
  • మోసం చేయడమే చంద్రబాబు నైజమంటూ వ్యాఖ్యలు
  • గిరిజనులను ఇంకా మోసగిస్తూనే ఉన్నారని వెల్లడి
  • జగన్ గిరిజనుల గుండెల్లో చోటు సంపాదించారన్న విజయసాయి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు పేరు వింటేనే ఏజెన్సీ ప్రాంతం ఉలిక్కిపడుతుందని తెలిపారు. మోసం చేయడమే చంద్రబాబు నైజమని, ఏజెన్సీలోని గిరిజనులను ఇంకా మాయమాటలతో మోసగిస్తూనే ఉన్నారని ఆరోపించారు. "తాను మళ్లీ అధికారంలోకి వస్తానని, గిరిజనులను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా చేస్తానని చెబుతున్నాడు. ఎన్టీఆర్ కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచినట్టే గిరిజనులను కూడా దెబ్బకొట్టాడు"  అంటూ విమర్శించారు.

కానీ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గిరిజన గూడేలలో తిరిగి వారి కష్టనష్టాలు తెలుసుకున్నారని, ఇప్పుడు వారికి మెరుగైన జీవనం ఇచ్చేందుకు కృషి చేస్తున్నారని విజయసాయి వెల్లడించారు. తండ్రి వైఎస్సార్ లాగే జగన్ కూడా గిరిజనుల గుండెల్లో చోటు సంపాదించారంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.
Vijay Sai Reddy
Chandrababu
Jagan
Tribals

More Telugu News