New Delhi: కరోనా భయంతోనే ఫుల్ డ్రస్ రిహార్సల్స్... వీడియో ఇదిగో!

Independence day Full Dress Reharsala Near Red fort
  • శనివారం 74వ స్వాతంత్ర్య దినోత్సవం
  • వేడుకలకు ముస్తాబైన ఎర్రకోట
  • ఈ ఉదయం రిహార్సల్స్ చేసిన సైనికులు
మరో రెండు రోజుల్లో జాతి యావత్తూ 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న వేళ, కరోనా మహమ్మారి కారణంగా ఈ దఫా ఎటువంటి హంగు, ఆర్భాటాలు లేకుండానే వేడుకలను జరపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పతాకావిష్కరణ చేసే న్యూఢిల్లీలోని ఎర్రకోట, పంద్రాగస్టు వేడుకల కోసం ముస్తాబైంది. సైనిక వందన సమర్పణ ఫుల్ డ్రస్ రిహార్సల్ నేడు జరిగింది.

కరోనా మహమ్మారి సోకకుండా అధికారులు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. వందన సమర్పణ భౌతిక దూరం పాటిస్తూ చేసే వీలు లేకపోవడంతో, సైనికులంతా మాస్క్ లను ధరించారు. ఈ వేడుకల్లో పాల్గొనే వారంతా గడచిన కొన్ని వారాలుగా క్వారంటైన్ లోనే ఉండటం గమనార్హం. వీరికి తరచూ కరోనా పరీక్షలు కూడా నిర్వహించారు.

నేడు ఢిల్లీలో భారీ వర్షం కురుస్తూ ఉన్నప్పటికీ, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, డ్రస్ రిహార్సల్ రెడ్ పోర్ట్ ముందు జరిగింది. లైన్ టూ లైన్ మార్క్ లో సైనికులు, బ్యాండ్ సిబ్బంది ఈ రిహార్సల్స్ నిర్వహించారు. శనివారం జరిగే వేడుకలకు పరిమిత సంఖ్యలోనే వీక్షకులకు అనుమతినిస్తామని ఇప్పటికే ఉన్నతాధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
New Delhi
Independence Day
Full Dress Reharsals
Red Fort
Corona Virus

More Telugu News