Nara Lokesh: ఇటీవల గిరిజన మహిళని ట్రాక్టర్‌తో తొక్కించి చంపారు.. ఇప్పుడు గిరిజన యువకుడు బలి: లోకేశ్

lokesh fires on ycp leaders
  • వైఎస్ జగన్ భూదాహానికి బలైపోతున్నారు
  • భూమి కోసం గిరిజన యువకుడిని పొట్టన పెట్టుకున్నారు
  • చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో దారుణం 
  • డబ్బా బాబ్లీని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 'వైఎస్ జగన్ భూదాహానికి దళితులు, గిరిజనులు బలైపోతున్నారు. భూమి కోసం గిరిజన యువకుడిని పొట్టన పెట్టుకున్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చింతలపాళెం  పంచాయతీ, మరాఠీపురానికి చెందిన 112 షికారీ కుటుంబాలకు 1971 నుంచి మూడు విడతలుగా సుమారు 560 ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆ భూమిని కొట్టేయడానికి అధికార పార్టీ నాయకులు దాడికి దిగి 23 మందిని గాయపర్చారు' అని చెప్పారు.

'గిరిజన యువకుడు డబ్బా బాబ్లీని అత్యంత కిరాతకంగా హత్యచేశారు. గిరిజన మహిళని అప్పు తీర్చలేదంటూ వైకాపా నాయకుడు ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన మరవక ముందే ఇప్పుడు గిరిజన యువకుడు బలైపోయాడు' అని చెప్పారు.  

'అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకున్న భూమిని వెంటనే దళితులు, గిరిజన కుటుంబాలకు అందజేయాలి. డబ్బా బాబ్లీని హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి' అని లోకేశ్ ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు.
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh

More Telugu News