ఫ్యాక్ట్ చెక్... ఈ భయంకర వీడియో హైదరాబాద్, మెహిదీపట్నంలోది కాదు!
- ఇటీవల హైదరాబాద్ లో వర్షాలు
- హోర్డింగ్ విరిగిపడ్డట్టు వీడియో వైరల్
- పాకిస్థాన్ లో వీడియోపై ఇక్కడ పుకార్లు
వాస్తవానికి ఇది పాకిస్థాన్ లోని కరాచీలో జరిగింది. ఈ నెల 6వ తేదీన కరాచీ మెట్రోపోల్ హోల్ సమీపంలో ఇది జరిగిందనడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. పాకిస్థాన్ టీవీ వార్తా చానెళ్లు దీన్ని ప్రసారం చేశాయి కూడా. ఆ వెంటనే నగరంలోని అన్ని బిల్ బోర్డులనూ తొలగించాలని కమిషనర్ కార్యాలయం అధికారులను ఆదేశించింది కూడా. ఈ వీడియో హైదరాబాద్ లోనిది కాదంటూ, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ సైతం ట్వీట్ చేశారు. పాకిస్థాన్ వీడియోను మీరూ చూడవచ్చు.