Andhra Pradesh: ఏపీ జిల్లాల్లో కరోనా మరణ మృదంగం... ఒక్కరోజులో 93 మంది బలి

Death rate raised in Andhra Pradesh as more fatalities emerges
  • అత్యధికంగా గుంటూరు జిల్లాలో 13 మంది మృతి
  • 2,296కి పెరిగిన మొత్తం మరణాలు
  • కొత్తగా 9,597 పాజిటివ్ కేసులు
ఏపీలో కరోనా మరణాలు నానాటికీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 93 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 13 మంది మృత్యువాత పడ్డారు. ప్రకాశం జిల్లాలో 11 మంది, చిత్తూరు జిల్లాలో 10 మంది, నెల్లూరు జిల్లాలో 10 మంది కన్నుమూశారు. ఇతర జిల్లాల్లోనూ కరోనాతో మరణాలు నమోదవుతుండడంపట్ల ఆందోళన నెలకొంది.

ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 2,296కి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 9,597 పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 2,54,146 కాగా, ఇంకా 90,425 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా, 6,676 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకు 1,61,425 మంది కరోనా నుంచి కోలుకున్నట్టయింది.
Andhra Pradesh
Corona Virus
Death Rate
Positive Cases
COVID-19

More Telugu News