Palem Srikanth Reddy: ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనాతో మృతి

Famous industrialist Palem Srikanth Reddy dies of corona
  • కొన్నిరోజులుగా కరోనాతో పోరాడుతున్న శ్రీకాంత్ రెడ్డి
  • హైదరాబాదు యశోదా ఆసుపత్రిలో చికిత్స
  • ఈ మధ్యాహ్నం కన్నుమూత
కరోనా రక్కసి తెలుగు రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. తాజాగా, ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనా వైరస్ కు బలయ్యారు. గత కొన్నిరోజులుగా ఈ మహమ్మారితో పోరాడుతున్న శ్రీకాంత్ రెడ్డి హైదరాబాదు యశోదా ఆసుపత్రిలో ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. పాలెం శ్రీకాంత్ రెడ్డికి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. ఆయన గతంలో కడప లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాయలసీమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.
Palem Srikanth Reddy
Death
Corona Virus
Yasodha Hospital
Hyderabad

More Telugu News