Botsa Satyanarayana: సెప్టెంబర్ 20 నుంచి సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు: బొత్స

Secretariat exams will be held from Sep 20 says Botsa
  • వారం పాటు పరీక్షల నిర్వహణ ఉంటుంది
  • 10 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం
  • పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలి
ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షకు మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, సెప్టెంబర్ 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరుగుతాయని చెప్పారు.

వారం రోజుల పాటు పరీక్షల నిర్వహణ ఉంటుందని... మొత్తం 10 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. తొలి రోజునే దాదాపు 4.5 లక్షల మంది పరీక్షలకు హాజరవుతారని చెప్పారు. పారదర్శకంగా పరీక్షలను నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు సూచించారు. ఖాళీగా ఉన్న పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులపై కూడా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
Botsa Satyanarayana
Volunteers exams
YSRCP

More Telugu News