మరోసారి తల్లి కాబోతున్న కరీనా కపూర్
- మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న కరీనా, సైఫ్
- తమ ఇంట్లోకి కొత్త వ్యక్తి రాబోతున్నారని ప్రకటన
- ఇప్పటికే వీరికి ఒక కుమారుడు
కరీనా, సైఫ్ ఇద్దరూ కలిసి 'ఓంకారా', 'ఏజెంట్ వినోద్', 'ఖుర్బాన్' అనే చిత్రాల్లో నటించారు. ఈ సమయంలో వారు ప్రేమలో పడ్డారు. 2012లో పెళ్లి చేసుకున్న వీరికి 2016లో కుమారుడు జన్మించాడు. చిన్నారికి తైమూర్ అని వీరు పేరు పెట్టుకున్నారు. కరీనా చివరగా 'ఆంగ్రేజీ మీడియం' చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె కరణ్ జొహార్, అమీర్ ఖాన్ లకు చెందిన రెండు ప్రాజెక్టుల్లో ఉంది. మరోవైపు సైఫ్ కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.