వెంకటేశ్ ఇప్పట్లో షూటింగ్ చేయనట్టే!

  • గతేడాది వెంకటేశ్ నుంచి ఎఫ్ 2', 'వెంకీమామ' 
  • శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తాజాగా 'నారప్ప'
  • తదుపరి షెడ్యూలు షూటింగ్ జనవరి నుంచి    
హీరో వెంకటేశ్ కథలు ఎంచుకోవడంలో చాలా దిట్ట. తన వయసుకు, తన బాడీ లాంగ్వేజ్ కు, తన ఇమేజ్ కి తగ్గా కథలను ఎంచక్కా ఎంచుకుంటూవుంటారు. ఆ క్రమంలోనే గతేడాది 'ఎఫ్ 2', 'వెంకీమామ' చిత్రాల ద్వారా ప్రేక్షకులను ఆయన అలరించారు. ఆ తర్వాత వెరైటీ కోసం 'నారప్ప' చిత్రాన్ని ఒప్పుకున్నారు. తమిళంలో వచ్చిన హిట్ చిత్రం 'అసురన్'కి ఇది రీమేక్. అయితే, మన వాతావరణానికి తగ్గట్టుగా దీనికి అక్కడక్కడ మార్పులు చేశారు. రాయలసీమ ప్రాంతంలో భూ తగాదాలు, కొట్లాటల నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుందట.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూలు షూటింగ్ లాక్ డౌన్ కి ముందు అనంతపురం జిల్లాలోనూ, తమిళనాడు సరిహద్దుల్లోనూ జరిగింది. ఇక ఇప్పుడు కరోనా వ్యాప్తి ముమ్మరంగా ఉండడంతో ఇప్పట్లో ఈ చిత్రం తదుపరి షూటింగులో పాల్గొనడానికి వెంకటేశ్ ఆసక్తి చూపడం లేదట. అందుకే, వచ్చే ఏడాది జనవరి వరకు షూటింగును వాయిదా వేసినట్టు చెబుతున్నారు. జనవరి నుంచి మిగతా షూటింగ్ నిర్వహించి వేసవిలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో వెంకటేశ్ సరసన ప్రియమణి కథానాయికగా నటిస్తోంది.

Venkatesh
Shreekaanth Addala
Priyamani

More Telugu News