జగన్ వల్ల రాయలసీమ ప్రాజెక్టులకు చెడ్డపేరు వస్తోంది: కాల్వ శ్రీనివాసులు
- ప్రచార యావతో రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు
- జగన్ విధానాలు రాయలసీమకు కీడు తెచ్చేలా ఉన్నాయి
- వ్యక్తిగత స్వార్థం కోసం సీమకు కీడు చేస్తున్నారు
జగన్ మాత్రం ప్రచారం పిచ్చితో రాయలసీమకు తీరని ద్రోహం చేస్తున్నారని శ్రీనివాసులు మండిపడ్డారు. అపెక్స్ కౌన్సిల్ లో, కేఆర్ఎంబీలో ఏపీకి కీడు చేసేలా జగన్ విధానాలు ఉన్నాయని విమర్శించారు. రాయలసీమకు చేటు తెచ్చేలా ఉన్నాయని దుయ్యబట్టారు. వ్యక్తిగత స్వార్థం కోసం రాయలసీమకు ద్రోహం చేస్తున్న జగన్ ను సీమప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు నిలదీయాలని అన్నారు.