Etela Rajender: తీరు మార్చుకోకుంటే 50 శాతం పడకల స్వాధీనం: ప్రైవేటు ఆసుపత్రులకు మంత్రి ఈటల హెచ్చరిక

Minister Etela Rajender fires on private hospitals
  • కొవిడ్ చికిత్సకు అధిక వసూళ్లు
  • ఇప్పటి వరకు 1039 ఫిర్యాదులు
  • ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష
ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోమారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో నిన్న సమావేశమైన మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ చికిత్సకు అధిక బిల్లుల వసూళ్లపై ఇప్పటి వరకు 1039 ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. ఫిర్యాదులు వచ్చిన ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని, లేదంటే 50 శాతం పడకలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.
Etela Rajender
Telangana
COVID-19

More Telugu News