సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'చివరకు గెలిచేది టాలెంటే' అంటున్న రకుల్
- కామెడీ పాత్ర పోషిస్తున్న మీనా
- 11 భాషల్లో విడుదలవుతున్న వర్మ 'థ్రిల్లర్'
* ఒకప్పటి ప్రముఖ కథానాయిక మీనా తాజాగా ఓ వెబ్ సీరీస్ లో నటిస్తోంది. 'కరోలిన్ కామాక్షి' పేరుతో రూపొందే ఈ వెబ్ సీరీస్ లో మీనా సీబీఐ ఆఫీసర్ గా కామెడీ పాత్రలో కనిపిస్తుందట. వచ్చే నెల నుంచి దీని షూటింగ్ జరుగుతుంది.
* ఈ కరోనా సమయంలో రాంగోపాల్ వర్మ వరుసగా సినిమాలు తీసేస్తూ డిజిటల్ వేదికగా రిలీజ్ చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో అప్సరా రాణి, రాక్ కచ్చి ప్రధాన పాత్రల్లో రూపొందించిన 'థ్రిల్లర్' చిత్రాన్ని ఈ నెల 14 నుంచి తన సొంత పోర్టల్ ద్వారా స్ట్రీమింగ్ చేస్తున్నారు. విశేషం ఏమిటంటే, దీనిని తెలుగుతో పాటు మొత్తం 11 భారతీయ భాషల్లో అనువదించారు.