Phantom: కిచ్చా సుదీప్ 'ఫాంటమ్' ఫస్ట్ లుక్ వచ్చేసింది!

Phantom First look Released
  • హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం
  • సుదీప్ పాత్ర పేరు విక్రమ్ రోనా
  • ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకుడు
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటిస్తున్న 'ఫాంటమ్' ఫస్ట్ లుక్ ను చిత్ర దర్శకుడు అనూప్ భండారి విడుదల చేశారు. లాక్ డౌన్ నిబంధనలను సడలించిన తరువాత, తిరిగి షూటింగ్ జరుపుకుంటున్న పెద్ద హీరో చిత్రం ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఇక, చిత్రంలో సుదీప్ పాత్రను పరిచయం చేసిన అనూప్... ఈ క్యారెక్టర్ పేరు విక్రమ్ రోనా అని పేర్కొన్నారు. పేరుకు మాదిరే క్యారెక్టర్ కూడా పవర్ ఫుల్ గా ఉంటుందని అన్నారు. అతనేం చేస్తాడో, ఎందుకు చేస్తాడో ఎవరికీ తెలియదని, పాత్ర స్వభావం గురించి సూక్ష్మంగా వివరణ ఇచ్చారు.
Phantom
Firstlook
Sudeep

More Telugu News