విజయవాడ ప్రమాదంపై వెంకయ్య నాయుడు, మోదీ దిగ్భ్రాంతి
- అగ్ని ప్రమాద ఘటనపై విచారం
- మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి
- బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఈ ప్రమాదంపై సీఎం జగన్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నానని వివరించారు.
ఈ ప్రమాదంపై కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ... 'విజయవాడలోని కోవిడ్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగిందని తెలిసి దిగ్భ్రాంతి చెందాను. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యల్లో చురుగ్గా ఉన్నాయి. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను' అని ఆయన ట్వీట్ చేశారు.