అజ్ఞాతం వీడిన రియా చక్రవర్తి.. ఈడీ కార్యాలయంలో ప్రత్యక్షం!

  • సుశాంత్ ఆత్మహత్య కేసులో రియాపై ఆరోపణలు
  • సుశాంత్ అకౌంట్ల నుంచి తరలిన డబ్బు
  • ఈడీ విచారణకు హాజరైన రియా
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రియురాలు రియా చక్రవర్తి ఎట్టకేలకు అజ్ఞాతం వీడింది. బీహార్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఆమెపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల నుంచి కోట్లాది రూపాయలు ట్రాన్స్ ఫర్ కావడంపై ఈడీ విచారించనుంది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని రియాను ఆదేశించింది.

అయితే, సుప్రీంలో తన పిటిషన్ విచారణకు వచ్చేంత వరకు తన స్టేట్ మెంట్ ను రికార్డు చేయవద్దని ఈడీని రియా కోరింది. అయితే, ఆమె విన్నపాన్ని ఈడీ అధికారులు తిరస్కరించారు. అంతేకాదు, ఈరోజు 11.30 గంటలకు విచారణకు హాజరు కావాలని మరోసారి సమన్లు జారీ చేశారు. దీంతో, విధిలేని పరిస్థితుల్లో ముంబైలోని ఈడీ కార్యాలయానికి ఆమె హాజరైంది.


More Telugu News

Rhea Chakraborthy Sushant Singh Rajput Enforcement Directorate Bollywood