Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాతృభాషలో చేయకపోవడానికి కారణం చెప్పిన మల్లూ బేబీ!

Anupama Parameshvaran about why she is not doing films in Malayalam
  • 'ప్రేమమ్' సినిమా ద్వారా పరిచయమైన అనుపమ 
  • ఇంటర్వ్యూలు బాగా ఇచ్చానన్న ముద్దుగుమ్మ  
  • సినిమాలో చిన్న పాత్ర కావడంతో ట్రోలింగ్ 
  • బాగా హర్ట్ అయ్యానని చెప్పిన అనుపమ
ఎవరైనా అవకాశాలు వస్తే మాతృభాషలోనే ఎక్కువ సినిమాలు చేస్తారు. అయితే, అందుకు భిన్నంగా కథానాయిక అనుపమ పరమేశ్వరన్ ఇతర భాషల్లో చేస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేస్తూ మలయాళం వైపు కనీసం ఓ చూపు కూడా చూడడం లేదు. ఐదేళ్ల క్రితం మలయాళంలో వచ్చిన 'ప్రేమమ్' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ చిన్నది ఆ తర్వాత ఇన్నేళ్లలో కేవలం ఒకే ఒక్క మలయాళ సినిమా చేసింది. ఈ నేపథ్యంలో తాను మాతృభాషలో ఎందుకు ఎక్కువగా చేయడం లేదన్నది అనుపమ తాజాగా వివరించింది.

"ప్రేమమ్ విడుదలైనప్పుడు నేను చాలా చిన్న పిల్లని. అప్పుడు నాకసలు ఏమీ తెలియదు. ఎవరో తెలిసున్న వాళ్లు చెబితే, ప్రమోషన్స్ సమయంలో మీడియాలో ఇంటర్వ్యూలు ఎక్కువగా ఇచ్చేశాను. దానికి తోడు, చిన్నపిల్లని కదా, సమాధానాలు కూడా ఏవేవో చెప్పేశాను. తీరా చూస్తే, ప్రేమమ్ సినిమాలో నాది చిన్న క్యారెక్టర్. దాంతో అందరూ నన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఇంటర్వ్యూలలో చాలా బిల్డప్ ఇచ్చానంటూ ట్రోల్ చేశారు. దాంతో బాగా అప్సెట్ అయ్యాను. అందుకే, మలయాళం సినిమాలకు దూరంగా వుండాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. వచ్చిన సినిమాలను తిరస్కరించాను. ఇతర భాషలపై దృష్టి పెట్టాను.. అదే కారణం!" అంటూ చెప్పుకొచ్చింది అనుపమ.  
Anupama Parameshvaran
Premam
Malayalam

More Telugu News