దళిత యువకుడిని బూటుకాలితో తన్నిన కాశీబుగ్గ సీఐపై సస్పెన్షన్ వేటు
- దళిత యువకుడిని తల్లిముందే బూటుకాలితో తన్నిన సీఐ
- సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విమర్శల వెల్లువ
- ప్రాథమిక విచారణ అనంతరం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
బాధితుడు పలాస మండలంలోని టెక్కలిపట్నంకు చెందిన వ్యక్తి. ఇళ్ల పట్టా విషయంలో గ్రామానికి చెందిన జగన్, రమేశ్ అనే యువకుల మధ్య గొడవ జరిగింది. దీంతో ఇద్దరూ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితుడు జగన్పై సీఐ రెచ్చిపోయాడు. తల్లిముందే అతడిపై దాడిచేసి బూటుకాలితో తన్నాడు. ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.