హోటల్ వ్యాపారాన్ని ఆదుకునేందుకు.. దేశ ప్రజలకు బ్రిటన్ అద్భుత ఆఫర్!
- 18 లక్షల మంది చెఫ్‌లు, వెయిటర్లు, ఇతర సిబ్బంది ఉద్యోగాలు కాపాడడమే లక్ష్యం
- సోమవారం నుంచి బుధవారం వరకు ఆఫర్
- ఆఫర్‌ను రూపొందించిన మంత్రి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు
దేశంలో ఎంపిక చేసిన దాదాపు 72 వేల రెస్టారెంట్లు, కేఫ్‌లు, పబ్‌లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. దీనికి ‘ఈట్ అవుట్ టు హెల్ప్ అవుట్’ అనే పేరు పెట్టారు. దేశంలో దెబ్బతిన్న హోటల్ వ్యాపారాన్ని తిరిగి పట్టాలెక్కించడమే లక్ష్యంగా ఈ ఆఫర్‌ను ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 18 లక్షల మంది చెఫ్‌లు, వెయిటర్లు, ఇతర సిబ్బంది ఉద్యోగాలను కాపాడడమే లక్ష్యంగా ఈ ఆఫర్‌ను తెరపైకి తీసుకొచ్చినట్టు ఆర్థిక మంత్రి రిషి సునక్ పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడైన ఆయనే ఈ పథకానికి రూపకల్పన చేయడం విశేషం. ఆఫర్ ప్రకటించిన తర్వాత బ్రిటన్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి.