Mahesh Babu: రాఖీ పండుగ స్పెషల్.. తన కొడుకు, కూతురి ఫొటో పోస్ట్ చేసిన మహేశ్ బాబు

Mahesh Babu  Celebrate the eternal bond of love
షార్ట్స్‌లో చూడండి
రాఖీ పండుగ సందర్భంగా సినీనటుడు మహేశ్ బాబు తన కూతురు, కుమారుడి ఫొటోను పోస్ట్ చేశారు. ఇంట్లో కార్పెట్ ఫై కూర్చొని గౌతం, సితార దిగిన ఈ ఫొటో మహేశ్ బాబు అభిమానులను అలరిస్తోంది. శాశ్వతమైన ప్రేమ బంధం, రక్షణ, జాగ్రతలకు ప్రతీకైన ఈ పండుగను జరుపుకుంటున్నామని చెప్పారు.

'రక్షాబంధన్ శుభాకాంక్షలు.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి' అని మహేశ్ బాబు పేర్కొన్నారు. కాగా, రాఖీ పండుగ సందర్భంగా సినీ ప్రముఖులు తమ సోదరులు, సోదరీమణులను గుర్తు చేసుకుంటున్నారు. తమ ఇంట్లో జరుపుకుంటోన్న ఈ పండుగ ఫొటోలను పోస్ట్ చేస్తూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంట్లోనే ఉండి పండుగ చేసుకోవాలని పిలుపునిస్తున్నారు.
Go Back to Shorts
Mahesh Babu
Tollywood
Twitter

More Telugu News