mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లాలో రౌడీషీటర్ దారుణ హత్య

మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని ఆవంచలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన బచ్చలకూర మాసయ్య (40)ను నిన్న రాత్రి 9 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా పొడిచి చంపారు.

పోలీసుల కథనం ప్రకారం.. మాసయ్య నిన్న రాత్రి  గ్రామం నడిబొడ్డున ఉన్న దర్గా వద్ద కత్తిపోట్లకు గురై అరుస్తూ కుప్పకూలాడు. గమనించిన స్థానికులు అక్కడికి వెళ్లేసరికే ప్రాణాలొదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. ఓ హత్యకేసులో మాసయ్య నిందితుడని పోలీసులు తెలిపారు. అతడిపై రౌడీషీట్ కూడా ఉందన్నారు. మాసయ్య హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
mahabubnagar
rowdy sheeter
murder
Telangana
Crime News

More Telugu News