లడఖ్ వద్ద సైన్యాన్ని ఉపసంహరించుకుని.. లిపులేక్ వద్ద మోహరిస్తున్న చైనా
- వక్రబుద్ధిని మళ్లీ బయటపెట్టుకున్న చైనా
- సైన్యాన్ని వెనక్కి తీసుకున్నట్టు ఇటీవలే ప్రకటించిన డ్రాగన్ కంట్రీ
- అప్రమత్తమైన భారత్
లిపులేఖ్తోపాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఉత్తర ప్రాంతాల్లోని భారత సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తోంది. చైనా తీరుతో అప్రమత్తమైన భారత్ కూడా సరిహద్దుల వద్దకు సైన్యాన్ని తరలిస్తోంది. చైనా వెనక్కి తగ్గుతుందా? లేదా? అన్న దానితో సంబంధం లేకుండా తాము ఎప్పటికప్పుడు వివిధ ప్రాంతాలకు సైన్యాన్ని తరలిస్తున్నట్టు భారత సైన్యాధికారులు తెలిపారు. మరోవైపు, లడఖ్ నుంచి వెనక్కి తగ్గుతున్నట్టు చెప్పిన చైనా వాస్తవాధీన రేఖ వెంబడి శాశ్వత సైనిక స్థావరాలను నిర్మిస్తోంది.