Crane: విశాఖపట్నంలో ఘోరప్రమాదం... భారీ క్రేన్ కూలి ఏడుగురి మృతి

Fatal crane collapse caused death of seven people
  • హిందూస్థాన్ షిప్ యార్డులో దుర్ఘటన
  • క్రేన్ ను తనిఖీ చేస్తుండగా ప్రమాదం
  • అనేకమందికి గాయాలు
  • క్రేన్ బరువు 75 మెట్రిక్ టన్నులు
విశాఖపట్నం హిందూస్థాన్ షిప్ యార్డులో ఘోరప్రమాదం జరిగింది. ఓ భారీ క్రేన్ కూలిన సంఘటనలో ఏడుగురు వ్యక్తులు మరణించారు. క్రేన్ ను చెక్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. క్రేన్ కింద పలువురు చిక్కుకున్నట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం సంఘటన స్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ భారీ క్రేన్ బరువు 75 మెట్రిక్ టన్నులు. 10 ఏళ్ల కిందట దీనిని షిప్ యార్డు కార్యకలాపాల నిమిత్తం కొనుగోలు చేశారు. ఈ క్రేన్ హిందూస్థాన్ షిప్ యార్డుకు చెందినదే అయినా దాని నిర్వహణను ఇటీవలే ఔట్ సోర్సింగ్ సంస్థకు అప్పగించినట్టు తెలుస్తోంది.
Crane
Accident
Hindustan Ship Yard
Vizag
Andhra Pradesh

More Telugu News