Shankar Narayana: మూడు రాజధానులకు ఇది సమయం కాదా... మరి, షూటింగులకు ఇది సరైన సమయమా?: పవన్ ను ప్రశ్నించిన ఏపీ మంత్రి

AP Minister Shankar Narayana condemns Pawan Kalyan comments on decentralization
  • జనసేన జనం కోసం చేసిందేమీ లేదన్న శంకర్ నారాయణ
  • ఒక పనికిమాలిన సేన అంటూ వ్యాఖ్యలు
  • ప్యాకేజీ కోసం తప్ప ప్రజలకోసం కాదని విమర్శలు
ఏపీ మంత్రి శంకర్ నారాయణ జనసేన పార్టీపైనా, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పైనా విమర్శనాస్త్రాలు సంధించారు. జనసేన పార్టీ జనం కోసం చేసింది ఏమీలేదని, అది ఒక పనికిమాలిన సేన అని వ్యాఖ్యానించారు. మూడు రాజధానులకు ఇది సమయం కాదని పవన్ కల్యాణ్ అంటున్నారని, మరి ఇది షూటింగులకు సరైన సమయమా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ గానీ, జనసేన గానీ ప్యాకేజీ కోసం తప్ప ప్రజల కోసం కాదని విమర్శించారు. అనంతపురం జిల్లా పెనుకొండలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.
Shankar Narayana
Pawan Kalyan
Three Capitals
Janasena
Andhra Pradesh

More Telugu News