Kiara Advani: కియరా అద్వానీకి ప్రియుడి బర్త్ డే  గ్రీటింగ్స్

Sidharth wished Kiara on her birthday
  • 28వ పుట్టిన రోజును జరుపుకున్న కియరా
  • సన్ షైన్ గర్ల్ అంటూ గ్రీటింగ్స్ చెప్పిన సిద్ధార్థ్
  • థ్యాంక్యూ మంకీ అని రిప్లై ఇచ్చిన కియరా
సినీ నటి కియరా అద్వానీ 28వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె ఫ్యాన్స్, స్నేహితులు, సహచరులు అందరూ చెప్పిన శుభాకాంక్షలతో ఆమె సోషల్ మీడియా ఖాతాలు నిండిపోయాయి. అయితే ఒక స్పెషల్ పర్సన్ నుంచి వచ్చిన గ్రీటింగ్స్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాయి. అతను మరెవరో కాదు. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా. సిద్ధార్థ్ తో కియరా డేటింగ్ చేస్తోందనే వార్తలు గత కొంత కాలంగా బీటౌన్ లో షికార్లు చేస్తున్నాయి.

కియరా పుట్టిన రోజు సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో సిద్ధార్థ్ ఇలా రాసుకొచ్చాడు. 'హ్యాపీ బర్త్ డే సన్ షైన్ గర్ల్. బిగ్ లవ్ అండ్ హగ్స్' అని రాశాడు. కియరా ఫొటోను షేర్ చేశాడు. ఈ గ్రీటింగ్స్ కు కియరా స్పందిస్తూ... 'థ్యాంక్యూ మంకీ' అని సరదాగా రిప్లై ఇచ్చింది.
Kiara Advani
Sidharth Malhotra
Bollywood

More Telugu News