naga chaitanya: ఇలా చేయడం వల్లే ప్రాణాపాయ స్థితిని కొనితెచ్చుకుంటున్నారు: హీరో నాగచైతన్య

naga chaitanya on corona
  • కొవిడ్‌-19  సోకితే భయపడిపోతుంటారు
  • ఒత్తిడికి గురవ్వడం వల్లే అధికంగా సమస్యలు
  • లక్షణాలున్నా చాలా మంది బయటకు చెప్పలేకపోతున్నారు
  • వైరస్‌పై ప్రతి ఒక్కరూ భయాల్ని వీడాలి
కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయిందని తెలియగానే భయపడిపోతుంటారని, దాంతో ఒత్తిడికి గురవ్వడం వల్లే అధికంగా సమస్యలొస్తాయని సినీ హీరో నాగచైతన్య అన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన కరోనా వైరస్‌ గురించి మాట్లాడాడు. భయంతోనే వైరస్‌ లక్షణాలున్నా చాలా మంది బయటకు చెప్పలేకపోతున్నారని, ఇలా చేయడంతో ప్రాణాపాయ పరిస్థితుల్ని కొని తెచ్చుకుంటున్నారని ఆయన అన్నాడు.

వైరస్‌పై ప్రతి ఒక్కరూ భయాల్ని వీడాలని నాగచైతన్య పిలుపునిచ్చాడు. కరోనా సోకి కోలుకున్నాక అనుభవాల్ని అందరితో పంచుకోవాలని ఆయన చెప్పాడు. అలాగే, ప్లాస్మా దానం చేయాలని, అది చాలా మంది ప్రాణాల్ని నిలబెడుతుందని తెలిపాడు. వైరస్‌ సోకిన వారి పట్ల వివక్ష చూపొద్దని, అందరం కలిసి ధైర్యంగా పోరాడితే కరోనాపై విజయం సాధించగలమని చెప్పాడు.
naga chaitanya
Tollywood
Corona Virus

More Telugu News