కరోనాకు మరో టీకా: బ్రిటన్ లో తొలి దశ ప్రయోగాలు విజయవంతం!
- తొలి దశలో కనిపించని దుష్ప్రభావాలు
- రెండో దశ విజయవంతమైతే అక్టోబరు నాటికి టీకా
- వచ్చే ఏడాది నాటికి సమర్థవంతమైన టీకా అందుబాటులోకి వస్తుందన్న అమెరికా
బ్రిటన్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గడంతో టీకా పనిచేస్తోందా? లేదా? అన్నది నిర్ధారించడం కష్టమవుతోందని, కాబట్టి మరో చోట దీనిని పరీక్షించాలని భావిస్తున్నట్టు ప్రయోగం నిర్వహిస్తున్న శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహిస్తున్న రాబిన్ షాటాక్ తెలిపారు. కాగా, కరోనా మహమ్మారిని సమర్థంగా అడ్డుకోగలిగే టీకా వచ్చే ఏడాది కల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అమెరికాకు చెందిన అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంధోనీ ఫౌచీ ఆశాభావం వ్యక్తం చేశారు.