బాలయ్య తదుపరి సినిమా ఇదేనా?
- ప్రస్తుతం బోయపాటితో బాలకృష్ణ మూడవ చిత్రం
- లాక్ డౌన్ కారణంగా షూటింగుకి తాత్కాలిక బ్రేక్
- బాలయ్య కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న అనిల్ రావిపూడి
ఈ నేపథ్యంలో.. ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ చేయబోయే తదుపరి చిత్రం గురించి తాజాగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే, 'ఎఫ్ -2', 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఓ చిత్రాన్ని చేయనున్నట్టు తెలుస్తోంది. బాలయ్యతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్న దర్శకుడు అనిల్ తాజాగా ఆయన కోసం ఓ కథను సిద్ధం చేశాడట. త్వరలోనే బాలయ్యతో స్క్రిప్టుకి ఆమోదముద్ర వేయించుకునే ప్రయత్నంలో ఆయన వున్నారని సమాచారం.