రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్.. అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ

  • అర్ధరాత్రి గవర్నర్ పేరుతో ప్రకటన
  • ఉత్తర్వులు విడుదల చేసిన గోపాలకృష్ణ ద్వివేదీ
  • సోమవారం బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మళ్లీ నియమితులయ్యారు. ఈ మేరకు గత అర్ధరాత్రి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ప్రకటన జారీ అయింది. నిమ్మగడ్డను తిరిగి ఎస్‌ఈసీగా నియమిస్తున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, అత్యున్నత ధర్మాసనంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడే పునర్నియామకం ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, రమేశ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

Andhra Pradesh
SEC Nimmagadda
AP governor

More Telugu News