ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంకగాంధీ
- ఆగస్ట్ 1లోగా బంగ్లాను ఖాళీ చేయాలన్న కేంద్రం
- ప్రస్తుతం కొనసాగుతున్న కొత్త ఇంటి పనులు
- కొంత కాలం గురుగ్రామ్ లోని ఓ ఇంట్లో ఉండనున్న ప్రియాంక
ప్రియాంకకు గత ఏడాది ఎస్పీజీ భద్రతను కేంద్రం తొలగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న ప్రియాంకకు ప్రభుత్వ బంగ్లాను కేటాయించడం కుదరదని పేర్కొంటూ... ఆగస్ట్ 1 నాటికి బంగ్లాను ఖాళీ చేయాలని కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ ఆమెకు నోటీసులు జారీ చేసింది.