రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్గా వచ్చిన గోవింద్ సింగ్.. అభినందించిన సచిన్ పైలట్!
- కాంగ్రెస్ రాజస్థాన్ చీఫ్గా గోవింద్ సింగ్ డోటాసరా
- ఒత్తిడి, పక్షపాతం లేకుండా పనిచేయాలన్న పైలట్
- కార్యకర్తలకు సముచిత స్థానం ఇవ్వాలని సూచన
ఖాళీ అయిన రాష్ట్ర అధ్యక్ష పదవిలో గోవింద్ సింగ్ను కూర్చోబెట్టింది. నిన్న ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పైలట్ ఆయనకు అభినందనలు తెలిపారు. కాగా, రాజస్థాన్లో పైలట్ రాజేసిన నిప్పు ఇంకా రాజుకుంటూనే ఉంది. తమకు పూర్తి మద్దతు ఉన్నప్పటికీ అసెంబ్లీని సమావేశపరచకుండా గవర్నర్ కల్రాజ్ మిశ్రా అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపిస్తున్నారు. ఈ నెల 31న అసెంబ్లీని సమావేశపరచాలంటూ మూడోసారి చేసిన అభ్యర్థనను గవర్నర్ తాజాగా తిరస్కరించారు.