శిరోముండనం ఘటనకు నిరసనగా సీఎం జగన్ కు తలనీలాలు అంకితమిచ్చిన టీడీపీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు

  • దళితులపై దాడులపై మోకా ఆనంద్ సాగర్ నిరసన
  • శిరోముండనం చేయించుకున్న వైనం
  • దోషులను శిక్షించాలంటూ డిమాండ్
రాష్ట్రంలో దళితులపై తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయంటూ తూర్పు గోదావరి జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు మోకా ఆనంద్ సాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో ఎస్సై దెబ్బలకు చనిపోయిన దళిత యువకుడికి, రాజమండ్రి సమీపంలోని రాజానగరంలో సామూహిక అత్యాచారానికి గురైన బాలికకు, పోలీస్ స్టేషన్ లో శిరోముండనానికి గురైన దళిత యువకుడికి, మండపేటలో అత్యాచారానికి గురైన దళిత విద్యార్థినికి... వీళ్లందరికీ కూడా కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉత్తుత్తి అరెస్ట్ లు, ఉత్తుత్తి సస్పెన్షన్ లు, క్రమశిక్షణ చర్యలతో తమను మభ్యపెట్టలేరని అన్నారు. అసలు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆనంద్ సాగర్ కూడా శిరోముండనం చేయించుకున్నారు. ఆపై తన తలనీలాలను సీఎం జగన్ కు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు.


Moka Anand Sagar
Jagan
Tonsured
SC Cell
Vice President
East Godavari District
Telugudesam

More Telugu News