ఆ ధైర్యం మీ ప్రభుత్వానికి ఉందా.. వైఎస్ జగన్ గారు?: దేవినేని ఉమ
- నిన్న7,627 కరోనా కేసులు, 56 మరణాలు
- నేటికి లక్ష కేసులు దాటాయి
- 1,000 మరణాలు దాటాయి
- కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
కాగా, 24 గంటల వ్యవధిలో కొత్తగా అత్యధికంగా కర్నూలులో 1,213 మందికి, తూర్పు గోదావరిలో 1,095 మందికి, పశ్చిమగోదావరి జిల్లాలో 859 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని పలు పత్రికల్లో పేర్కొన్న వార్తలను దేవినేని పోస్ట్ చేశారు. నిన్నటి వరకు మొత్తం కేసుల సంఖ్య 96,298గా ఉందని, మొత్తం మరణాలు 1,041కు చేరాయని అందులో పేర్కొన్నారు.