దౌత్యకార్యాలయం ఖాళీ చేయాలంటూ అమెరికా ఆదేశాలు.. కీలక పత్రాలు దహనం చేసిన చైనా అధికారులు!
- హూస్టన్ లో చైనా రాయబార కార్యాలయం మూసివేత
- హూస్టన్ నుంచి వెళ్లిపోవాలన్న అమెరికా
- చైనా రాయబార కార్యాలయంలో పొగలు
- అగ్నిమాపక సిబ్బందిని అనుమతించని చైనా
దాంతో డ్రోన్ లు, నిచ్చెనల సాయంతో అగ్నిమాపక అధికారులు లోపల జరుగుతున్న తతంగాన్ని గమనించారు. పెద్ద ఎత్తున కీలక పత్రాలను దహనం చేస్తున్నట్టు గుర్తించారు. అందుకే అంతగా పొగలు వచ్చినట్టు తెలుసుకున్నారు. అంతేకాదు, చైనా దౌత్యాధికారులు పెద్ద ఎత్తున వాహనాల్లో సామగ్రిని తరలించారు. చైనా గూఢచర్యం ద్వారా రాబట్టిన సాంకేతిక పరిజ్ఞానం, సైంటిఫిక్ డేటాను ఇప్పటివరకు ఈ దేశం సరిహద్దులు దాటిస్తున్నట్టు భావిస్తున్నారు.