ఏపీలో 80 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

AP crosses eighty thousand mark in corona positive cases
  • కొత్తగా 8,147 పాజిటివ్ కేసులు
  • మరో 49 మంది మృతి
  • ఇవాళ 2,380 మంది డిశ్చార్జి
ఏపీలో కరోనా కేసులు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 8,147 పాజిటివ్ కేసుల వెల్లడి కాగా, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 80,858కి చేరింది. అన్ని జిల్లాల్లో భారీగా కొత్త కేసులు గుర్తిస్తున్నారు. ఎప్పట్లాగానే తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కొత్తగా 1029 మందికి  కరోనా సోకినట్టు తేలింది. ఇక, మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదైంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 49 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దాంతో కరోనా మృతుల సంఖ్య 933కి పెరిగింది. అటు, కరోనా నుంచి కోలుకున్న 2,380 మందిని డిశ్చార్జి చేశారు. ఇంకా 39,990 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Positive
Deaths
COVID-19

More Telugu News