Ambati Rambabu: కరోనాను జయించి త్వరలో మీ ముందకు వస్తా: అంబటి

Ambati Rambabu says that he will win over corona
  • అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్
  • ఐసోలేషన్ లో ఉన్నానని అంబటి వెల్లడి
  • తన ట్విట్టర్ అకౌంట్ వెరిఫై అయిందన్న వైసీపీ ఎమ్మెల్యే
వైసీపీ అగ్రనేత అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించారు. తన ట్విట్టర్ అకౌంట్ వెరిఫై అయిందని, తన అఫిషియల్ అకౌంట్ నుంచి ట్వీట్ చేస్తున్నానని తెలిపారు. తనకు కరోనా వచ్చిన విషయం అందరికీ తెలిసిందేనని, అయితే కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, పెద్దల ఆశీస్సులతో కరోనాను జయించి త్వరలో మీ ముందుకు వస్తాను... ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు. అంతకుముందు ఓ వీడియోలో ఆయన మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ వచ్చినా తాను చాలా ధైర్యంగా ఉన్నానని, ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నానని వెల్లడించారు. ఐసోలేషన్ లో ఉన్నందున ఎక్కువమందికి ఫోన్ ద్వారా జవాబు ఇవ్వలేకపోతున్నానని తెలిపారు.
Ambati Rambabu
Corona Virus
Positive
YSRCP
Andhra Pradesh

More Telugu News