Police: ప్రముఖ హీరోయిన్లు తన ప్రియురాళ్లు అంటూ ప్రచారం చేసుకుంటున్న వ్యక్తి అరెస్ట్

Police arrested a youth who says famous heroines were his girlfriends
  • సునిశిత్ అనే యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • గతంలో అతడిపై లావణ్య త్రిపాఠి ఫిర్యాదు
  • ఇబ్రహీంపట్నం, కీసరలో అతడిపై పలు కేసులు
సామాజిక మాధ్యమాల్లో సినీ తారలకు వేధింపులు కొత్త కాదు. అయితే, ఓ యువకుడు వినూత్న తరహాలో, ప్రముఖ హీరోయిన్లు తన ప్రియురాళ్లు అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. అంతేకాకుండా అనేకమంది హీరోయిన్లపై సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేశాడు. ఇప్పుడా వ్యక్తిని కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి పేరు సునిశిత్. ఇబ్రహీంపట్నం, కీసర పోలీస్ స్టేషన్ లో సునిశిత్ పై కేసులు ఉన్నాయి. అతడిపై సినీ కథానాయిక లావణ్య త్రిపాఠి గతంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సునిశిత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Police
Arrest
Heroines
Girlfriends
Lavanya Tripathi
Hyderabad

More Telugu News