ఎస్సై దాడిలో ప్రాణాలు కోల్పోయిన దళిత యువకుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన జగన్

Jagan announces rs 10 laks exgracia to Kiran family
  • చీరాల ఎస్సై దాడి వల్ల ప్రాణాలు కోల్పోయిన కిరణ్
  • విచారణకు ఆదేశించిన సీఎం
  • ఆందోళనకు సిద్ధమవుతున్న దళిత సంఘాలు
కిరణ్ అనే దళిత యువకుడిపై మూడు రోజుల క్రితం చీరాల ఎస్సై విజయ్ కుమార్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కిరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. కిరణ్ కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులతో విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ కు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి.

మృతుడి కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం.. 19వ తేదీన తన స్నేహితులతో కలిసి కిరణ్ బైక్ పై బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఎస్సై వారిని ఆపి మాస్క్ ధరించకపోవడంతో దాడి చేశాడు. ఈ దాడిలో కిరణ్ స్పృహతప్పి పడిపోయాడు. ఆ తర్వాత అతడిని చీరాల ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి... అక్కడి నుంచి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కిరణ్ చనిపోయాడు. ఈ నేపథ్యంలో, దళిత సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఎస్సై విజయ్ కుమార్ పై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని దళిత నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Go Back to Shorts
Kiran
Chirala
Dead
Jagan
YSRCP
SI

More Telugu News