రాజ్యసభ సభ్యులుగా ఆళ్ల, పిల్లి సుభాష్, మోపిదేవి ప్రమాణం
- ప్రమాణ స్వీకారం చేయించిన వెంకయ్య నాయుడు
- హిందీలో ప్రమాణ స్వీకారం చేసిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి
- తెలుగులో చేసిన పిల్లి సుభాష్, మోపిదేవి
మరో సభ్యుడు పరిమళ్ నత్వానీ కారణాంతరాల వల్ల ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఆయన మరో రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 20 రాష్ట్రాల నుంచి మొత్తం 61 మంది సభ్యులు ఎన్నికైన విషయం తెలిసిందే. వారిలో కొంతమంది ఈ రోజు ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేకపోయారు.