Balakrishna: కావలి ఉద్రిక్తతలపై స్పందించిన బాలకృష్ణ... ఎంతవరకైనా వెళదాం అంటూ భరోసా

Balakrishna reacts over Kavali incident
  • కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు
  • టీడీపీ కార్యకర్తల సమావేశానికి పోలీసుల అభ్యంతరం
  • ఎట్టి పరిస్థితుల్లో విగ్రహం ఉండాల్సిందేనన్న బాలయ్య
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు వివాదాస్పదం అయింది. దాంతో టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు సమావేశం నిర్వహించి ఏం చేయాలన్న దానిపై చర్చించాలని భావించారు. అయితే సమావేశం జరుగుతున్న ప్రాంతం రెడ్ జోన్ లో ఉందంటూ పోలీసులు అడ్డుకున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. కావలి టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి ఫోన్ చేశారు. నందమూరి అభిమానులకు తాను భరోసాగా ఉంటానని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్టీఆర్ విగ్రహం ఉండాల్సిందేనని అన్నారు. సమావేశం విరమించవద్దని అభిమానులకు సూచించారు. కేసులకు భయపడవద్దని, ఎంతవరకైనా పోరాడదామని వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.
Balakrishna
Kavali
NTR Statue
Telugudesam
Andhra Pradesh

More Telugu News