Guntur District: గుంటూరు జిల్లాలో కరోనా కలకలం.. జిల్లా కలెక్టర్ కు పాజిటివ్!

Guntur District collector tests Corona positive
  • గుంటూరు జిల్లాపై కరోనా పంజా
  • ఇప్పటికే 6 వేలు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య
  • పలువురు జిల్లా అధికారులకు పాజిటివ్
గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ప్రతి రోజు దాదాపు 500కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 6 వేలు దాటింది. ఇప్పటివరకు 63 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఏకంగా జిల్లా కలెక్టర్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో, ఆయన హోం క్వారంటైన్ కు వెళ్లిపోయారు. అంతేకాదు, కలెక్టర్ ఛాంబర్ ను కూడా తాత్కాలికంగా మూసేశారు. జాయింట్ కలెక్టర్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా వైద్య అధికారి, పలువురు జిల్లా అధికారులకు కూడా ఇప్పటికే పాజిటివ్ రావడంతో వారంతా క్వారంటైన్ కు వెళ్లిపోయారు.
Guntur District
District Collector
Corona Virus

More Telugu News