ఒక్కరోజులో రూ.97 వేల కోట్లు వచ్చిపడ్డాయి... అమెజాన్ అధినేత రికార్డు
- స్టాక్ మార్కెట్లో పెరిగిన అమెజాన్ షేరు విలువ
- సానుకూల రేటింగ్ ఇచ్చిన గోల్డ్ మన్ శాక్స్
- 189 బిలియన్ డాలర్లకు పెరిగిన బెజోస్ సంపద
ఈ ఒక్క సంవత్సరంలోనే ఆయన 74 బిలియన్ డాలర్లు ఆర్జించారంటే అమెజాన్ ప్రాభవం ఎంతలా వెలిగిపోతుందో చెప్పవచ్చు. ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ గోల్డ్ మన్ శాక్స్ కూడా అమెజాన్ షేర్లపై సానుకూల రేటింగ్ ఇవ్వడంతో స్టాక్ మార్కెట్లో అమెజాన్ ప్రభంజనం కొనసాగింది. అమెజాన్ షేరు 2018 డిసెంబరు తర్వాత ఈ స్థాయిలో లాభపడడం ఇదే ప్రథమం.